రుణగ్రహీతలకి ఎస్బీఐ తీపికబురు..!

-

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఎస్బీఐ మీకు శుభవార్త చెబుతోంది. ఇప్పుడు ఎస్బీఐ చౌక వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తోందని ప్రకటించింది. దీని వలన మీరు ఏ లోన్ కావాలన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో తీసుకోవచ్చు.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. అన్ని లోన్స్ కూడా ఇప్పుడు తక్కువ వడ్డీకే ఇస్తోంది. కనుక లోన్ తీసుకోవాలని అనుకునేవాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది.

ఇక ఎస్బీఐ అందిస్తున్న లోన్స్ పై వడ్డీ రేట్లు ఎలా వున్నాయంటే..? హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. వడ్డీ రేటు 6.7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అదే కారు లోన్ పొందాలని యోచిస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్ పొందాలని యోచిస్తే వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ని తీసుకోవాలంటే లోన్‌పై 9.3 శాతం వడ్డీ పడుతుంది.

ఇది ఇలా ఉండగా ఎస్‌బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు పడుతుంది. అలానే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణం పై వడ్డీ రేటు మారొచ్చు గమనించండి. హోమ్ లోన్‌కు ఇది ప్రధానంగా వర్తిస్తుందట. ఎవరైతే లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు బ్యాంక్ కి వెళ్లే కాదు రుణం కోసం యోనో ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news