ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్ (05293) రైలు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 10.45 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి చేరుకొని మరుసటిరోజు రాత్రి 23.50 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ (05294) రైలు ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి గురువారం ఉదయం 3.55 బయలుదేరి.. శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
ఈ రైలు ఇరుమార్గాల్లో హజీపూర్, పాటలిపుత్ర, దానాపూర్, ఆరా జంక్షన్, బక్సర్, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, సాత్న, కట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే పీఆర్వో శ్రీధర్ తెలిపారు. రైలులో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఎకానమీ క్లాస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.