తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ తేదీని పోడిగించిన బోర్డు..

-

తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది..విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది..ఈ నెల 8 వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చునని తెలిపింది.

పలు సబ్జెక్టు లలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వాస్తవానికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించడానికి జూలై 6 ఆఖరి తేదీ అని ప్రకటించారు.

కాగా, విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థన వల్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును పొడించారు. విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ఇంటర్ బోర్డ్ సూచించింది.

ఆగస్టు 1వ తేదీ నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను జూలై 22న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షలను జరపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news