తెలంగాణ మందుబాబులకు గుడ్‌న్యూస్

-

తెలంగాణ మందుబాబులకు కేసీఆర్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూను మరింత పెంచుకునే నేపథ్యం లో… మద్యం షాపుల సంఖ్య ను మరింత పెంచనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌్‌ నాటికి ఇప్పుడున్న 2216 లిక్కర్‌ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. కాబట్టి మద్యం షాపుల వేలం తప్పని సరిగా జరిగి తీరుతుంది.

ఇందు కోసం ప్రభుత్వం లోని ఎక్సైజ్‌ విభాగం.. కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్‌ చివరి నాటికి తేవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే.. అదనంగా మరో 200 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిజంగానే అమలు చేస్తే… సర్కార్‌ ఖజానా మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. అయితే.. ఈ కొత్త మద్యం షాపులను హైదరాబాద్‌ కరీంనగర్‌, వరంగల్‌ లాంటి నగరాల్లోనే ఎక్కువగా అనుమతులు ఇస్తారని తెలుస్తోంది. కాగా… ఇటీవలే.. బీర్లపై రూ. 10 మేర ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news