Big News : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

-

కేంద్ర ప్రభుత్వం మరోసారి మన రాష్ట్ర రైతులకు వెన్నుముక్కగా నిలిచింది. కేంద్రం 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు ఇటీవలే ఆమోదం తెపదం జరిగింది. ఇప్పుడు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర రైతులకు మద్దతునందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఆనందం వ్యక్తపరిచారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని వెల్లడించారు ఆయన.

e-Paddy Procurement : Dept. of Food and Supplies, Govt. of West Bengal

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిరంతర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన గడువు లోపు ఎఫ్సీఐ కు బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. పారాబాయిల్డ్ రైస్ సేకరణ కోసం గత నెల్లో కేంద్రమంత్రి ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news