తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్…!

-

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పబుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇంటర్ వార్షిక పరీక్ష పత్రాలలో ఛాయిస్ ను మరింత పెంచాలని బోర్డు నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. గతేడాది కూడా ఇంటర్ పరీక్షల్లో చాయిస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు సెక్షన్ లలో రెండు సెక్షన్ లలో ఛాయిస్ ఇస్తూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ ఏడాది కూడా రెండు మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంటర్ లో రెండు మార్కుల ప్రశ్నల్లో 10 కి 10 రాయాల్సి ఉంటుంది.

అయితే ఆ ప్రశ్నలను ఇప్పుడు 15కు పెంచి అందులో 5 ఛాయిస్ ఇస్తూ పది రాయాల్సి ఉంటుంది. అదే విధంగా 4 మార్కుల ప్రశ్నల్లో 8 రాయమనేవారు. ఇప్పుడు ఆ ప్రశ్నలను 12 పెంచారు. అదేవిధంగా గత ఏడాది లాగే ఈ సారి కూడా 70% సిలబస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. కరోనా నేపథ్యం లో క్లాసులు సరిగ్గా జరగపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అంతే కాకుండా ఇటీవల మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ ఈసారి కచ్చితంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ జరుగుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news