నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల..

-

బ్యాంక్ జాబ్స్ చెయ్యాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే మీకో గుడ్ న్యూస్..బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన తాజాగా ఒక నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు..ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది బ్యాంక్. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది..

పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం..

ఇక్కడ 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ లో ఆన్లైన్లో టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది.. సెలెక్ట్ అయినా వారికి వెంటనే ఉద్యోగాల్లో చేరే అవకాశం..

దరఖాస్తు విధానం..
*. అభ్యర్థులు మొదటగా బ్యాంక్ వెబ్ సైట్ https://www.idbibank.in/ను ఓపెన్ చేయాలి.

*. అనంతరం careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*. తర్వాత Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*. నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*. తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.

*. తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపి సబ్మిట్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ను దాచుకోవాలి..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది.. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news