నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఈ నెల‌లో ఉద్యోగ నోటిఫికేషన్లు!

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. కాగ ఈ నెల చివ‌రి వారంలో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్నట్టు స‌మాచారం. అందు కోసం ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగ ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖ‌ల్లో ఉన్న ఖాళీల గురించి ఆరా తీశారు.

jobs
jobs

ఒక రిపోర్టు చేసి ఇవ్వాల‌ని కూడా ఆదేశించారు. కాగ ప్ర‌స్తుతం రాష్ట్రంలో 70 వేల‌కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని స‌మాచారం. అందులో పోలీసు ఉద్యోగాలు దాదాపు 17 వేల‌కు పైగానే ఉన్నాయ‌ని తెలుస్తుంది. అలాగే మిగిలిన‌వి.. గ్రూప్ – 2, గ్రూప్ – 3 ఉద్యోగాల‌తో పాటు ప‌లు టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల‌ను అతి త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news