నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఆ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు..

-

నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇప్పుడు కూడా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ పరిధిలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ’ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది..ఉద్యోగాలను ఖాళీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ విభాగాల్లో మొత్తం 598 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 4వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు..

ఖాళీల వివరాలు..

సైంటిస్ట్-బి : 71 పోస్టులు

సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు

సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు

మొత్తం: 598

బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ విద్యార్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది.. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు..అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో తగ్గింపు ఉంటుంది.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు https://www.calicut.nielit.in/nic23/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూసి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news