ఆ బ్యాంక్ కస్టమర్స్ కి శుభవార్త…!

-

ఐసీఐసీఐ బ్యాంకులో మీకు ఖాతా వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు రూ.2 కోట్ల పైనుంచి రూ.5 కోట్ల వరకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచడం జరిగింది. పూర్తి వివరాల లోకి వెళితే.. రూ.2 కోట్ల పైనుంచి రూ.5 కోట్ల వరకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి.

ఇవి సెప్టెంబర్ 08, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక కొత్త వడ్డీ రేట్లను చూస్తే.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఎఫ్డిలపై 3.50 శాతం నుంచి 5.90 శాతం వడ్డీ వుంది. 7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్స్ కి 3.50 శాతం వడ్డీ రేటు వస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజుల వాటికైతే 3.60 శాతం, 46 రోజుల నుంచి 60 రోజులకైతే 4 శాతం, 61 రోజుల నుంచి 90 రోజులకైతే 4.75 శాతం వడ్డీ రేటు ఇస్తోంది బ్యాంక్.

ఇక ఇది ఇలా ఉంటే 91 రోజుల నుంచి 184 రోజులకైతే 5.25 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. 185 రోజుల నుంచి 270 రోజులకైతే 5.50 శాతం, 271 రోజుల నుంచి ఏడాదికి 5.70 శాతం, ఏడాది నుంచి ఐదేళ్లకైతే 6.05 శాతం, ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల వరకు అయితే 5.90 శాతం వడ్డీని పొందొచ్చు. కొత్త వడ్డీ రేట్లు కొత్త ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు రెన్యూవల్ చేసుకునే టర్మ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news