టెన్త్ చదువుతున్న వారికి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.5వేలు పొందండిలా..!

-

టెన్త్ ప్యాస్ అయ్యారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఈ అవకాశం ఇస్తున్నారు. జీఈఎస్‌టీ-2023 ని ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.దీనిలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా స్కాలర్ షిప్ అందుతుంది అని విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఫస్ట్ పది ర్యాంక్స్ వచ్చిన బాలికలకు అయితే నెలకు రూ.5 వేలు ఇస్తారు.

అదే నెక్స్ట్ 15 ర్యాంకులు పొందిన బాలికలకు అయితే నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తారు. ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్ పూర్తి చేసే దాకా ఇస్తారట. టెన్త్ చదివే బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. నేటి నుండి అప్లై చేసుకో వచ్చు. ఈ అవకాశం 30.11.2022 వరకు ఉంటుంది. www.ntrtrust.org లో ఆసక్తి వున్నా వాళ్ళు నమోదు చెయ్యచ్చు. 7660002627/7660002628 నెంబర్ల కి సంప్రదించచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news