మహిళా సంఘాలకు శుభవార్త..రూ.2.91 లక్షలు రుణం పొందే అవకాశం.. పూర్తీ వివరాలు..

-

తెలంగాణ సర్కార్ మహిళా సంఘాలకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలోని మహిళల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్ళించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో మహిళలకు సమాజ సమస్యలపై అవగాహన పెంచడం, వాటి పరిష్కారంలో మహిళా సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాలలో 4,39,534 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల లో 47,73,745 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలుగా ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాలలో మహిళా స్వయం సహాయక సంఘాల పై సెర్ప్‌ నిత్య పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు..

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు స్త్రీ నిధి సంస్థ మహిళలకు రుణాలను ఇవ్వడానికి రెడీ అయ్యింది.మాంసప్రియులు బాయిలర్‌ కోళ్లకు బదులు పెరటి కోళ్లను తినడానికి ఇష్టపడుతుండటంతో వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పెరటికోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపే స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల యూనిట్లను పంపిణీ చేయాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది.పెరటి కోళ్లకు మార్కెట్‌లో కిలోకు రూ.350-400 వరకు ధర లభిస్తుండటంతో పెంపకందారులు లాభాలు గడిస్తున్నారు.

కోళ్ల పెంపకంతో పాటు మదర్‌ యూనిట్లను పెంచడానికి కూడా రుణాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క మదర్‌ యూనిట్‌కు రూ.2.91 లక్షల రుణం ఇస్తారు. వీటి ద్వారా నెలకు రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా..ప్రతి మూడు నెలలకు పిల్లలని విక్రయిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,39,534 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.. ఈ రుణాల వల్ల మరింత మంది లబ్ది పొందుతారని అభిప్రాయ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news