రూ.15 వేల కంటే తక్కువ శాలరీ వస్తోందా…? అయితే మీకు EPFO నుండి గుడ్ న్యూస్…!

-

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా ఒక ట్వీట్ చేసింది. రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని ఉద్యోగులకి కలిపించింది. ఈ సౌకర్యాన్ని 31, 2022 వరకు పొడిగించారు.

 

epf

అధికారిక రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారు దీని వలన కలిగే లాభాలని పొందొచ్చు. ఈపీఎఫ్, మిస్‌లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద పని చేస్తోన్న కొత్త సంస్థలు, కొత్త ఉద్యోగులు ఏబీఆర్‌వై కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మార్చి 31, 2022 వరకు అర్హులని పేర్కొంది.

మార్చి 1, 2020 నుంచి 30 సెప్టెంబర్ 2021 మధ్యలో ఉద్యోగం పోగొట్టుకుని, మళ్లీ అక్టోబర్ 1 తర్వాత ఉపాధి పొందినా కూడా ఈ ప్రభుత్వ పథకం లాభాలని పొందొచ్చు. కేంద్రమే ఏబీఆర్‌వై కింద, ఉద్యోగి, కంపెనీ షేరును లేదా రెండేళ్ల పాటు ఉద్యోగి షేరును ఇస్తుంది.

ఎంప్లాయీ, ఎంప్లాయర్స్ ఈపీఎఫ్ఓ సహకారం వేతనంలో 24 శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ ఆ సంస్థలో వెయ్యి మంది వరకు కొత్త ఉద్యోగులుండాలి. అదే ఒకవేళ వెయ్యికి పైగా కొత్త ఉద్యోగులను కలిగి ఉంటే ఈపీఎఫ్ వేతనంలోని 12 శాతాన్ని మాత్రమే అందిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news