తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సీఎం కేసీఆర్ అనుమతులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పై ఈఆర్ సీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పై భారం పడకుండా.. ఛార్జీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ లను త్వరగా అందుబాటు లోకి తీసుకురావాలని అన్నారు. ముఖ్యం గా సోలార్ పవర్ పై దృష్టి సారించాలని సూచించారు.
అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ముఖ్య కారణం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలనే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి వరకు గ్రీన్ ఎనర్జీ సెస్ ను భారీగా పెంచిందని అన్నారు. రూ. 50 ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్ రూ. 400 వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దీంతో గత ఏడేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పై రూ. 7,200 కోట్ల భారం పడుతుందని అంటుంది. అయితే తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది.