క్రెడిట్‌ కార్డుపై లోన్‌ తీసుకుంటున్నారా..? సేఫేనా..?

-

క్రెడిట్‌ కార్డును వారే సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది. ఇందులో కూడా చాలా రకాలు ఉంటున్నాయి. ఒక్కో క్రెడిట్‌ కార్డు ఒక్కో రకమైన ఆఫర్లు ఉంటాయి. మన అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఎంచుకుంటాం. క్రెడిట్‌ లిమిట్‌ కూడా మన సిబిల్‌ను బట్టి డిసైడ్‌ అవుతుంది. అయితే మీకు తెలుసా..? క్రెడిట్‌ కార్డుపై కూడా లోన్‌ తీసుకోవచ్చు అని.! అత్యవసరంగా మీకు డబ్బు కావాలంటే ఎవర్నో అడిగే బదులు.. మీ క్రెడిట్‌ కార్డు ద్వారానే ఈజీగా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌పై లోన్‌ ఎలా తీసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు
క్రెడిట్‌ కార్డు

క్రెడిట్ కార్డ్‌పై లోన్‌ తీసుకోవడమంటే, క్రెడిట్ కార్డును పర్సనల్ లోన్‌ కోసం తాకట్టు పెట్టడమే. లోన్‌ డిఫాల్ట్ అయినప్పుడు నష్టాలను రికవర్‌ చేసేందుకు రుణదాత క్రెడిట్ కార్డును విక్రయించవచ్చు. ఈ లోన్‌లు సాధారణంగా ఇతర లోన్‌లతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లకే అందుబాటులో ఉంటాయట. మంచి క్రెడిట్ హిస్టరీ, గుడ్‌ పర్చేస్‌, రీపేమెంట్‌ ప్యాటర్న్‌ ఉన్న కస్టమర్లకు ఈ లోన్ ఎలిజిబిలిటీ లభిస్తుంది. లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు క్రెడిట్ లిమిట్‌కి మించి కూడా లోన్‌లు అందించవచ్చు.

క్రెడిట్ కార్డ్‌పై లోన్‌ తీసుకునే ముందు పరిశీలించాల్సిన అంశాలు

క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ క్రెడిట్ కార్డ్-బేస్డ్‌ లోన్‌లు అందిస్తారో లేదో ముందుగా చెక్‌ చేయండి. క్రెడిట్ కార్డ్ కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా వారి కస్టమర్ సర్వీస్‌కు కాల్‌ చేసి ఈ ఇన్‌ఫర్మేషన్‌ తెలుసుకోవచ్చు.

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, పేమెంట్‌ షెడ్యూల్, ఏవైనా ఇతర ఖర్చుల సహా లోన్‌కి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులను చదవడం, అర్థం చేసుకోవాలి.

లోన్ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లో బకాయిలు ఎక్కువగా ఉంటే, లోన్‌ అమౌంట్‌పై ప్రభావం చూపుతుంది.

ఆన్‌లైన్ మార్గాల ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, అడ్రస్‌, ఇన్‌కమ్‌ వంటి కొంత పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ అందించాల్సి ఉంటుంది. అదనంగా డాక్యుమెంట్‌లు సబ్మిట్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

అప్లికేషన్‌ను అప్రూవ్‌ చేసిన తర్వాత, లోన్ అమౌంట్‌ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. ఆ తర్వాత నెల నుంచి వడ్డీ, ఫీజులు సహా లోన్‌పై ఈఎంఐ చెల్లిస్తారు.

అయితే ఈ మొత్తం ప్రాసెస్‌ను సంబంధిత బ్యాంకు అప్లీకేషన్‌ ద్వారా చేసుకోవాలి. గూగుల్‌లో చూసి ఆ నెంబర్లకు కాల్‌ చేస్తే మీరు మోసపోయే ఛాన్స్‌ అవుతుంది. ఎప్పుడూ కూడా బ్యాంకులకు సంబంధించి గూగుల్‌ ఇచ్చే నెంబర్లను గుడ్డిగా నమ్మకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news