ఏపీ ఇంటర్ బోర్డులో కలకలం రేపుతున్న అవినీతి దందా

Join Our Community
follow manalokam on social media

ఏపీ ఇంటర్ బోర్డులో అవినీతి దందా కలకలం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ముగ్గురు అధికారుల మీద వేటు పడింది. ఏపీ ఇంటర్ బోర్డ్, డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల నుండి తొలగించారు. అలానే సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ల మీద బదిలీ వేటు పడింది. కాలేజీలకు అనుమతుల్లో రెండు కోట్ల దాకా వసూళ్లు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్సులకు ఉన్న డిమాండ్ ను అధికారులు సొమ్ము చేసుకున్నట్టు గుర్తించారు. ఒక్కో కాలేజీ నుండి లక్ష నుండి రెండు లక్షల దాకా వసూలు చేసినట్టు గుర్తించారు. అసలు దరఖాస్తు కూడా చేయని కాలేజీలకు అధికారులు అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా మరికొందరు అధికారులు కూడా ఈ అవినీతి దందాలో పాలుపంచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దీని వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....