బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి రేటు మరొక సారి తగ్గింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గిపోయాయి. దీనితో పసిడి ప్రేమికులకు రిలీఫ్ కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అలానే వెండి రేటు కూడా భారీగా తగ్గింది.
ఇక రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 క్షీణించింది. అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది.
రూ.500 తగ్గుదలతో రూ.44,850కు క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.48,930కు తగ్గింది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.28 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1779 డాలర్లకు చేరింది.
ఇక వెండి అయితే రూ.1100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,100కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1.14 శాతం పెరుగుదలతో 26.15 డాలర్లకు ఎగసింది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైనవి పసిడి రేటు పై ప్రభావం చూపుతాయని తెలిసిందే.