ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో సోమ, మంగళవారాల్లో జీతాలు పడే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
జూలై నెలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. శాసన మండలిలో అప్రాప్రియేషన్ బిల్లుకు టీడీపీ ప్రభుత్వం అడ్డుపడటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు వెల్లడించింది. పైగా ఇప్పటికే ఈ విషయంపై టీడీపీని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.