పెన్షనర్లకు కేంద్రం శుభవార్త…!

-

ఇండియా లో రిటైర్ అయ్యి పెన్షన్‌ అందుకుంటున్న వృద్ధులకు మెరుగైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెన్షన్ కి సంబంధించి అవసరమైన ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు వృద్ధులపై భారం తగ్గించడం కోసం దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక పూర్తి వివరాలని చూస్తే…

మధ్య ప్రదేశ్‌ లోని భోపాల్‌ లో జరిగిన బ్యాంకర్స్ అవేర్‌ నెస్ వర్క్‌షాప్‌ లో మాట్లాడారు. పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంక్ పోర్టల్స్, అనుభవ్‌ వంటి పెన్షన్ పోర్టల్స్ అన్నింటికీ కలిపి త్వరలో ఒకే ఒక సింగల్ పోర్టల్‌ ని తీసుకు రానున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అనేది ఒక కొత్త ప్లాట్‌ఫామ్. ఈ కారణంగా వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇక ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది చూసేస్తే..

https://ipension.nic.in పెన్షనర్లు కి సమస్యలేమీ లేకుండా చూస్తుంది. పెన్షనర్లు ఇప్పుడు బ్యాంక్‌ ఛేంజ్‌ చేసుకోవచ్చు. అలానే లైఫ్‌ సర్టిఫికెట్‌ ని కూడా సబ్మిట్ చేయవచ్చు. డెత్‌ సర్టిఫికెట్‌, పెన్షన్ స్లిప్, పెన్షన్ స్లిప్ రిట్రీవల్‌, ఇన్‌కం ట్యాక్స్‌ డిడక్షన్‌ డేటా/ఫారం 16 మొదలైన సేవలని పొందవచ్చు. పెన్షన్‌ డిస్బర్సింగ్‌ బ్యాంక్‌ల వెబ్‌సైట్‌లతో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. భవిష్య పోర్టల్‌తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్ పెన్షన్ సేవా పోర్టల్‌ను లింక్ చేసేందుకు అవుతుంది.

పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్‌ స్టేటస్‌, ఫారం-16ను ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. 18 పెన్షన్ డిస్బర్సింగ్‌ బ్యాంక్‌లు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌లో విలీనం అవుతాయి. అన్ని రకాల పనులను డిజిటలైజేషన్‌ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఆధార్‌ బేస్డ్‌ స్కీమ్‌ జీవన్‌ ప్రమాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2014 నవంబర్‌లో పెన్షనర్లు ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయడానికి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news