జబర్దస్త్ ద్వారా రాకేష్ – సుజాత ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

-

బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి దారుణమైన రేటింగ్స్ వస్తున్నాయి.. కానీ ఇందులో నటీనటులకు మాత్రం మంచి గుర్తింపు లభిస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నిర్వాహకులు కూడా కాస్ట్ కటింగ్ పేరుతో చాలామంది కమెడియన్స్ ను తొలగించేశారు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా పేరు పొందిన హైపర్ ఆది కూడా ఇప్పటికే షో నుంచి తప్పుకున్నారు. దీనికి కాస్ట్ కటింగ్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరొకవైపు జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా కూడా జబర్దస్త్ లో కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు అంటూ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సుజాతను పెళ్లి చేసుకున్న రాకింగ్ రాకేష్ చాలా కాలం ఆమెతో కలిసి కామెడీ స్కిట్స్ చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షో కారణంగా వీరిద్దరికీ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షో వల్లే బయట కూడా మరికొన్ని షోలలో పాల్గొనే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇకపోతే వీరిద్దరూ కూడా జబర్దస్త్ లో చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని కంటిన్యూ అవుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే రాకింగ్ రాకేష్, సుజాత చాలా తక్కువగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ జబర్దస్త్ కమెడియన్స్ మొత్తంలో లీస్ట్ రెమ్యునరేషన్ మాత్రం వీరిద్దరిదే అన్నట్లుగా వార్త వినిపిస్తోంది.. వాస్తవానికి కొంతమంది జబర్దస్త్ లో కనిపిస్తే చాలు పారితోషకం అక్కర్లేదు అన్నట్లుగా కూడా చేస్తూ ఉంటారు.. బయట షోలలో ఎక్కువ పారితోషకం వస్తుందని జబర్దస్త్ ను వదిలేసిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే చాలా మంది బయట ఆఫర్స్ వస్తున్నా జబర్దస్త్ ను వదిలి వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news