స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అందిసొంది. పండగ సీజన్‌లో కస్టమర్లకు శుభవార్తను బ్యాంక్ చెప్పింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ అందించింది బ్యాంక్.

వడ్డీ రేట్ల లో రాయితీని ఇస్తోంది. 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర ఉంటుందిట. 0.15 శాతం నుంచి 0.30 శాతం తగ్గింపు కలిపిస్తోంది స్టేట్ బ్యాంక్. ఈ ఆఫర్‌ను ఏకంగా 3 నెలలకు పైగా ఇస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటోంది. జనవరి 31 వరకు ఈ ప్రత్యేక రాయితీ ఆఫర్ చేస్తోందట.

ఇక ఇదిలా ఉంటే హోంలోన్లపై ఎస్‌బీఐ 8.55 శాతం నుంచి 9.05 శాతం వసూలు చేస్తోంది. కానీ పండుగ ఆఫర్ ని చూస్తే 8.40 శాతం 9.05 శాతం మధ్య వసూలు చేస్తుందిట. దీనితో లోన్ తీసుకునే వారికి బెనిఫిట్ కలగనుంది. అంతే కాక ఎస్‌బీఐ రెగ్యులర్, టాప్- అప్ హోం లోన్స్‌పై జీరో ప్రాసెసింగ్ బెనిఫిట్ ని కూడా కల్పించనుంది. కనుక ఈ అవకాశాన్ని పొందితే కస్టమర్స్ కి బెనిఫిట్ గా ఉంటుంది.