వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని ఇస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో ప్రధాన మంత్రి స్వనిధి పథకం ఒకటి. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. వీధి వ్యాపారులకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఈ స్కీమ్ కింద లోన్ ఇస్తున్నారు. 2020లో ఈ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది.

వీధి వ్యాపారులకు ఈ స్కీమ్ బాగుంటుంది. అయితే మోడీ ప్రభుత్వం 10,000 రుణాలను 20,000 కు పెంచాలని చూస్తోంది. దీనితో లోన్ ఎక్కువ వస్తుంది. 2020లో దాదాపు 20 లక్షల మందికి బ్యాంకులు రూ.10,000 రుణాన్ని మంజూరు చేసారు. 2021లో ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 9 లక్షల మందికి పైగా లోన్స్ ని ఇచ్చారు. సెప్టెంబర్ 2022 వరకు చూస్తే మొత్తం 2 లక్షల మందికి రూ.10,000 రుణాన్ని అందించారు.

ఇదిలా ఉంటే వీధి వ్యాపారులు మొదటిసారి లోన్ తీసుకుంటే రూ.10,000 బదులుగా రూ.20,000 పొందచ్చు. పైగా ఎలాంటి గ్యారెంటీ కూడా లేకుండానే లోన్ పొందొచ్చు. మొదటిసారి సంవత్సరానికి దరఖాస్తుకు రూ.10,000 లోన్. రెండవసారి 20,000 లోన్ ఇస్తారు. మూడోసారి రూ.50 వేల వరకు తీసుకోవచ్చు. ఈ లోన్ మీద 7 శాతం వడ్డీ రేటు చెల్లించాలి.

పీఎం స్వానిధి యోజన కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?

ఏదైనా ప్రభుత్వ బ్యాంకు కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
ఫారమ్‌ను పూరించాలి. ఆధార్ కార్డు కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.
లోన్ శాంక్షన్ అయ్యాక డబ్బులు అకౌంట్ లో పడతాయి.
బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు ఉండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news