టీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాని మోడీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఫ్యామిలీ కాదు..పీపుల్స్ ఫస్ట్ అంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు. టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ పేరు ఎత్తకుండానే ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కమలం వికసిస్తుంది.. మొదట్లో బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తే అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తు చేశారు ప్రధాని మోడీ.
మూఢ నమ్మకాల విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎవరు మంత్రి వర్గంలో ఉండాలి ? ఎవరిని తీసివేయాలి? ఏ ఆఫీసులో ఉండాలి అనేది మూఢ నమ్మకాల పేరుతో చేస్తున్నారని నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. తెలంగాణ ప్రజలకు వెన్నుపొడుస్తున్నారని మండిపడ్డారు.