ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్

-

ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్ అయ్యారు 12 మంది ఉద్యోగులు. 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సర్విస్ బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్ధికి రూ.10 వేలు చొప్పున చెల్లించాల్ని ఆదేశించింది.కోర్టుకు రాని మిగిలిన అభ్యర్ధులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. AP, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

సర్విస్ క్రమబద్ధీకరణ, పెండింగ్ జీతాలపై సుప్రీం ను ఆశ్రయించారు ఉద్యోగులు. రిలీవ్ అయిన ఉద్యోగుల తరపున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలోనే… సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులకు… ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news