వేసవిలో తిరుమల వెళ్లాలనుకునే వారికి శుభవార్త..!

-

రోజూ చాలా మంది తిరుమల వెళ్తూ వుంటారు. వేసవి సెలవుల కారణంగా తిరుమల లో రద్దీ బాగా పెరిగింది. విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ రావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమల వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తుంటారు. దీనితో ట్రైన్స్ కూడా ఫుల్ అయ్యాయి. ట్రైన్ లో వెళ్లాలంటే కనీసం పది రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో రైళ్లకు డిమాండ్ ఎంత ఉంటుందో మనకి తెలిసిందే. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లేవారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అడ్ టూరిజం కార్పొరేషన్ వేసవి లో తిరుమల వెళ్లేందుకు ఒక ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ఇక దాని వివరాలు చూస్తే… ‘గోవిందం తిరుపతి’ ప్యాకేజీ పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. 2 రాత్రులు, 2 పగళ్లు టూర్ ప్యాకేజీ ఇది. తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఉచితంగా ఇవ్వడంతో పాటు పద్మావతి ఆలయ దర్శనం కూడా ఉంటుంది. మొత్తం రెండు ప్యాకేజీలు వున్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.3,800, సింగిల్ షేరింగ్‌కు రూ.4,950 గా వుంది. కంఫర్ట్ ప్యాకేజీలో త్రిపుల్, డబుల్ షేరింగ్‌కు రూ.5,600, సింగిల్ షేరింగ్‌కు రూ.6,790 గా వుంది. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు (ట్రైన్ నెంబర్.12734) లింగంపల్లిలో స్టార్ట్ అవుతుంది.

తిరుపతిలో ఉదయం దిగాక హోటల్‌ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశం దర్శన చేసుకోవచ్చు. దర్శనం పూర్తయిన తరవాత తిరుపతికి చేరుకోవాలి. మధ్యాహ్నం హోటల్‌ లో భోజనం చేసి తిరుచానూరులోని పద్మావతి దర్శనం ఉంటుంది. తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌ దగ్గర దింపుతారు. అక్కడ ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు ఉదయం 3.04 గంటలకు నల్లగొండ, 5.35 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవ్వచ్చు. 6.55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news