దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి లాప్టాప్ లు అందజేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు సదరన్ క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు చక్రాల కుర్చీలు పంపిణీ చేయాలని సూచించారు. వారికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసిన కొత్తరకం బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేసినందుకు ప్లాన్ రెడీ చేయాలన్నారు.
కాగా, నేడు మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ప్లాంటుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టేనబుల్ మొబిలిటీకి తెలంగాణ కేంద్రంగా మారెందుకు ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. ఈ రంగంలో ఇండియాలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటని తెలిపారు. ఇందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు అమర రాజా యజమాని గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు.