ఐడీబీఐ బ్యాంకు కస్టమర్స్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే తాజాగా ఐడీబీఐ బ్యాంకు గుడ్ న్యూస్ ని చెప్పింది. పూర్తి వివరాలని చూస్తే.. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ని బ్యాంకు తీసుకు వచ్చింది. దీనితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తుంది.
700 రోజుల టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై అత్యధికంగా 7.60 శాతం వడ్డీ ని ఇస్తోంది. రిటైల్ అమృత్ మహోత్సవ్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా దీన్ని తీసుకు వచ్చినట్టు బ్యాంక్ అంది.
2022 డిసెంబర్ 26 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఇది.
ఇదిలా ఉంటే రిటైల్ టర్మ్ డిపాజిట్లపైన డిసెంబర్ 19 నుంచే వడ్డీ పెంచారు. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం 3.5 శాతం నుంచి 7 శాతం వడ్డీ వస్తోంది. అలానే నమన్ సీనియర్ సిటిజెన్ డిపాజిట్‌ను ఇటీవల సీనియర్ సిటెజన్లకు తీసుకు వచ్చారు. 2023, మార్చి 31 వరకు చేరే అవకాశం వుంది.