భారీ వర్షాలు : ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దించిన కెసిఆర్ సర్కార్

-

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల లో వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీ పై నుంచి మొదలుకుని కడెం, ఎల్లంపెల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో వరద పరిస్థితిని, కృష్ణ ఎగువన పరిస్థితిని అధికారులు సీఎం కెసిఆర్ కు వివరించారు. దీంతో సిఎస్ తో సహా నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు సిఎం కెసిఆర్. తక్షణమే కొత్తగూడెం, ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు, ఆర్మీ చాపర్ లో సీనియర్ అధికారులను పంపించాలని ఆదేశించారు సిఎం కెసిఆర్.

ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలని… లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిరాశ్రయులకు, షెల్టర్, బట్టలు, భోజన వసతులు ఏర్పాటు చేయాలని.. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి వున్నందున నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలన్నారు. ndrf టీం లతో సహ హెలికాప్టర్ లను మరిన్ని తెప్పించాలని ఆదేశించారు. గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలని.. రేపు, ఎల్లుండి పరిస్తితిని ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ తదితర శాఖలను సంసిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news