మనం ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేయాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ను చూస్తాము. అయితే ఇకపై అయితే ఇకపై మీరు యూట్యూబ్‌లో కూడా షాపింగ్ చేసే ఫెసిలిటీ అందుబాటులోకి రానుందని సమాచారం. ఇక టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్ భారీ ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు రావాలని ఆలోచిస్తుంది. అంతేకాదు గూగుల్ ప్లాన్‌తో దిగ్గజ ఈకామర్స్ సంస్థలకు చుక్కలు కనిపించబోతున్నాయి. ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు పోటీగా గూగుల్ సరికొత్త స్కెచ్ వేసింది. అయితే కరోనా వైరస్ టైమ్‌లో ప్రజల ట్రెండ్‌ను పసిగట్టిన గూగుల్ ఇప్పుడు షాపింగ్ విభాగంలో పోటీని రసవత్తరంగా మార్చేందుకు సిద్ధం అవుతోంది.
ఇక గూగుల్ తన పాపులర్ వీడియో ప్లాట్‌పామ్ యూట్యూబ్‌ను షాపింగ్ హబ్ గా మార్చేయాలని ఆలోచిస్తుంది. అంటే మీరు చిన్న పిల్లలకు బొమ్మ కొనాలన్నా.. లేదంటే మీ ఇంట్లో వారికి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలన్నా.. లేదంటే ఇతర ప్రొడక్టులు కొనాలని మీరు ఇతర ఈకామర్స్ సంస్థలకు వెళ్లాల్సిన పని లేదు. ఇకపై నేరుగా యూట్యాబ్ లోనే కొనేయవచ్చు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో సైట్ అయిన యూట్యూబ్ ఇప్పటికే క్రియేటర్లను షాపింగ్ అంశంపై సంప్రదించిందని సమాచారం. అంతేకాదు ప్రొడక్టుల ఫీచర్లను ట్యాగ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వీలుగు యూట్యూబ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించుకోవాలని క్రియేటర్లకు తెలిపారు. తర్వాత ఈ డేటా గూగుల్ అనలిటిక్స్ అండ్ షాపింగ్ టూల్స్ తో లింక్ అవుతుంది.
ఇక సింపుల్‌గా చెప్పాలంటే యూజర్లు వీడియోలు చూస్తూనే సులభంగా షాపింగ్ చేసేలా.. యూట్యూబ్‌ను మార్చాలని గూగుల్ ముందుకు వెళ్తుంది. ఇక యూట్యూబ్ వీడియోలను కేటలాగ్స్ గా ఉపయోగించుకొని నేరుగా వాటిపైనే క్లిక్ చేసి కొనుగోలు చేసే విధంగా ఉండేలా గూగుల్ టీమ్ పని చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలు నివేదికలు వెలువడ్డాయని పేర్కొన్నారు. త్వరలోనే గూగుల్ తన యూట్యూబ్‌లో షాపింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చని తెలుస్తోంది.