అమరావతి రైతుల ఆందోళన 300వందల రోజు సందర్భంగా ఢిల్లీ ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి లో 300 రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న అయన అమరావతి కోసం భూములు త్యాగాలు చేసిన రైతుల్లో అత్యధికులు దళితులు, బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు. ఇంతకాలం శాంతియుతంగా ఈ ఉద్యమం సాగిందని, ఇకపై సహనంతో భరించడం జరగదని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్న మా పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని అలానే పులివెందుల గాంధీ మనసు మారాలని కోరుకుంటున్నానని జగన్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు.
అమరావతి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందని, అమరావతి రాజధాని కొనసాగింపుకు రిఫరెండంగా మరలా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని నేను సవాలు విసిరానని అన్నారు. వాళ్ళే నా సవాలుకు స్పందించకుండా తోక ముడిచారని అన్నారు. యు.శ్రా.రై కాంగ్రెస్ పార్టీ నాయకులు నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారన్న ఆయన జగన్ సిఎం అయ్యాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. పలు కేసుల్లో బెయిల్ పొందిన వ్యక్తులే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను దుర్వియోగం చేస్తున్నందున వారి బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు.