గూగుల్‌ పే లో సూపర్ న్యూ ఫీచర్‌… పూర్తి వివరాలు ఇవే..!

-

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే పే చేయడానికి చూస్తున్నారు. క్యాష్ ని ఎక్కువగా తీసుకువెళ్లడం లేదు. పది రూపాయలు నుండి వేలు లక్షల వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ య్యే చేస్తున్నారు. ఫోన్ పే గూగుల్ పే ద్వారా సులభంగా మనం డబ్బులని పంపించుకోవచ్చు డబ్బులు ని పొందొచ్చు అయితే యూజర్లకి గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఇక ఆ విషయాన్ని చూసేద్దాం.. యూజర్లు ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం NPCI కు గూగుల్‌పే యాప్‌లో నమోదు చెయ్యవచ్చుట. ఈ కొత్త ఫీచర్‌ ని ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

పూర్తి వివరాలను చూస్తే.. ఆధార్‌ తో యూపీఐ చెల్లింపుల కోసం NPCI కు గూగుల్‌పే యాప్‌లో ఎంటర్ చెయ్యచ్చు. ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్‌బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్‌పే వాడే వాళ్ళు డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆధార్‌తో యూపీఐ పేమెంట్ చేసే అవకాశం ఇప్పటికి అయితే ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే వుంది. 22 బ్యాంకుల కస్టమర్లు ఆధార్ ఉపయోగించి గూగుల్ పే అథెంటికేషన్ చేసుకోవడానికి అవుతోంది.

ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకులు కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్‌, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటి అయ్యి ఉంటే ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవచ్చు. బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. దీని కోసం ముందు యూపీఐ యాప్‌ లోకి వెళ్లి సెట్ న్యూ యూపీఐ పిన్ ని ఎంచుకోవాలి. ఆ తరవాత ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ఎంచుకోవాలి. పాపప్ విండోలో ఆక్సెప్ట్ చేయాలి. ఆధార్ కార్డుపై ఉన్న చివరి 6 అంకెలను కొట్టి.. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. కొత్త యూపీఐ పిన్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news