ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ : తడిసిపోయిన బ్యాలెట్‌ పేపర్లు

-

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభ‌మైంది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెల‌కొంది. నెలల కొద్ది ఎదురుచూస్తున్న‌ అభ్యర్థుల భవితవ్యం మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌నున్న‌ది. ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే… ఈ ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని బ్యాలెట్‌ పేపర్లు తడిసిపోయాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

తూ. గో జిల్లాలోని మారేడుపల్లో బ్యాలెట్‌ పేపర్లు పూర్తి గా తడిపి పోయాయి. దీంతో బ్యాలెట్‌ పేపర్లను ఆరబెడుతోంది కౌంటింగ్‌ సిబ్బంది. అటు కర్నూల్‌ జిల్లాలోనూ తడిసిపోయాయి బ్యాలెట్‌ పేపర్లు. వెలుగోడు, అబ్దుల్లాపురం, గుంతకందాలో బ్యాలెట్‌ బాక్సు ల్లో కి నీళ్లు జమ అయ్యాయి. ఇక ఆముదాల వలసలోనైతే… బ్యాలెట్‌ పేపర్లకు చెదలు కూడా వచ్చింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఎంపిటిసి, జెడ్పిటిసి కౌంటింగ్ ప్రశాంతం గా జరుగుతోందని… మద్యాహ్నం లోపు ఎంపీటీసీ ఫలితాలు కొన్ని రావచ్చని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news