గూగుల్ ఫోన్ అన్లాక్ చేస్తే… రివార్డ్ తెలిస్తే నోరెళ్లబెడతారు…!

-

గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసిన వాళ్లకు భారీగా రివార్డ్ పెంచింది. రెండు లక్షల డాలర్ల నుంచి 1.5 మిలియన్ డాలర్ల వరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో భాధ్యత కరువైందని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారానికి గూగుల్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, హ్యాక్ చేయడం చాలా సులువు అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గూగుల్ వ్యక్తిగత భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ యొక్క పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో టైటాన్ ఎమ్ సెక్యూరిటీ చిప్‌లో దోషాలను గుర్తించేవారికి భారీగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. భద్రతా లోపాలను గుర్తించిన వారికి 2015 నుంచి నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లను చెల్లించామని చెప్పుకొచ్చింది. గత కొన్నాళ్లుగా ప్రముఖ సంస్థలు… ఆపిల్, బజ్‌ఫీడ్, ఫేస్‌బుక్ మరియు శామ్‌సంగ్‌తో సహా ఇతర సంస్థలు కూడా భద్రతా లోపాలను నివేదించినందుకు రివార్డులను అందిస్తున్నాయి.

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలోని టైటాన్ ఎమ్ సెక్యూరిటీ చిప్ వారి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సమగ్రతను కాపాడటానికి మరియు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే బయోమెట్రిక్ డేటాను నిల్వ చేయడానికి రూపొందించబడింది. ఇటీవలి కాలంలో బ్లాక్ మార్కెట్ లో ఫోన్ ని అన్లాక్ చేయడం అనేది చాలా సులువైందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అటు యాపిల్ కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో దీనిని అడ్డుకోవడానికి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ హ్యాకర్లను గూగుల్ నియమించుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news