కరోనా పాజిటివ్ వచ్చింది… హోమ్ ఐసోలేషన్ లో వున్నాను.. బాల్కనీలోకి వెళ్ళొచ్చా..?

-

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టిపీడిస్తోంది. నిజంగా ఇది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటువంటి సమయం లో అనేక మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈరోజు నిపుణులు పలు రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. మరి వాటి కోసం ఇప్పుడే చూద్దాం..!

నేను ఒంటరిగా ఉన్న సమయంలో కూడా మాస్కు ధరించాలా..?

కేవలం మీరు ఒక్కరే ఉంటే మాస్క్ ధరించాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి మీరు దీనికోసం ఆలోచించకండి.

సమ్మర్ కదా.. నేను ఏసి రూమ్ లోఉండొచ్చా..?

ఒకవేళ ఏసీ కనుక ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ లేకపోతే మీరు తలుపులు తీసి నిద్రపోండి. ఒకవేళ ఫ్రెష్ ఎయిర్ ఇన్ లెట్ ఉంటే ఏసి వేసుకున్నా పర్వాలేదు. ఎయిర్ చేంజ్ ఫెసిలిటీ ఉంటే ఫ్రెష్ ఎయిర్ ని తీసుకోవచ్చు.

నాకు పాజిటివ్ ఉంది నా కుటుంబ సభ్యులు నా దగ్గర నుంచి ఏమైనా తీసుకునేటప్పుడు ప్రతిసారి వాళ్ళు
గ్లౌజులు మార్చుకోవాలా..?

మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ దగ్గర నుంచి ఏమైనా సామాన్లని తీసుకుంటే తప్పనిసరిగా మార్చుకోవాలి గుర్తుపెట్టుకోండి. పాత గ్లౌజులు నుంచి వైరస్ స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళు వెంటనే ఆ పాత గ్లౌజులుని డస్ట్ బిన్ లో పడేసి కొత్త వాటిని ధరించండి.

ఇంట్లో కేవలం ఓకే వాష్ రూమ్ ఉంటే ఏం చేయాలి..?

ఒకవేళ కనుక కామన్ వాష్ రూమ్ మాత్రమే ఉంటే మీరు దానిని వాడిన ప్రతి సారి శానిటైజ్ చేయండి. ఆ తరువాత కూడా గ్లౌజులుని మార్చుకోండి.

ఒకే వాషింగ్ మిషన్ లో కలిపి బట్టలు ఉతుక్కోవచ్చా..?

లేదు అండి మీరు మీ బట్టల్ని వేరేగా వాష్ చేసుకోవాలి.

బాల్కనీ లోకి నేను వెళ్ళొచ్చా…? దీని వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అవుతారా..?

కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంటే బాల్కనీ లోకి వెళ్లడం మంచిది కాదు ఎందుకంటే బాల్కనీ లో అందరూ ఉంటారు. మీకు వేరేగా బాల్కనీ ఉంటే మీరు దానిని ఉపయోగించవచ్చు. కానీ వీలైనంతవరకు లోపల ఒంటరిగా ఉండటమే మంచిది.

ఎలక్ట్రానిక్ సామాన్లు అంటే లాప్టాప్స్ మరియు ఫోన్స్ వంటి వాటికీ కూడా శానిటైజ్ చేయాలా..?

ఒకవేళ మీరు వాడిన ఎలక్ట్రానిక్ సామాన్లు వేరొకరు ఉపయోగించాలంటే తప్పకుండా శానిటైజ్ చేయాలి. మీరు తిరిగి ఆరోగ్యంగా ఉండే వరకు వాటిని శానిటైజ్ చేయండి లేదంటే మిగిలిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news