హైదరాబాద్ లో పని చేస్తూ ఆంధ్రాలో తండ్రితో మహిళా డాక్టర్ కరోనా వ్యాపారం…!

కరోనా విషయంలో ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నా సరే, ఇంజక్షన్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నా సరే కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా పోలీసులు ఒక మహిళా డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు వద్ద అర్థరాత్రి పోలీసులు తనిఖీలు చేసారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు లొ అజయ్ కూమార్ వద్ద 100 రిమిడేసివిర్ ఇంజక్షన్ లను పోలీసులు పట్టుకున్నారు.

గుంటూరు లో ని యడ్లపాడు లోని అనుమతి లేని భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోం హాస్పటల్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. గరికపాడు సుబ్బారావు కుమార్తె భవ్య హైదరాబాదులోని ల్యాండ్ మార్క్ హాస్పటల్ చేస్తున్నారని గుర్తించారు. భవ్య ద్వారా గుంటూరు హాస్పటల్ కు తరలిస్తున్నారు. అజయ్ కుమార్ ,గరికపాటి సుబ్బారావు, భవ్య పై కేసు నమోదు చేసామని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనేదాని పై విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.