భారత గాన కోకిల, భారతరత్న అవార్డు గ్రహీత ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరంలో ఉన్నటువంటి శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలను నిర్వహించారు. ముఖ్యంగా లతా మంగేష్కర్ తన గానామృతంతో యావత్ భారతదేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకుంది. ఆమె మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 07 సోమవారం రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరొకవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాప్ డే హాలీడేగా ప్రకటించింది. ఫిబ్రవరి 07న హాఫ్ డే హాలీడేగా నిర్ణయించినట్టు బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. లతా మంగేష్కర్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరై ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. మరొక వైపు సోషల్ మీడియా వేదికగా లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు నెటిజన్లు. ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు.