రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యా సంస్థలకు లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దళిత మేధావి, దళితుల అభివృద్ధికి కృషి చేసిన బాలయోగి పేరును తొలగించడం దారుణమని చంద్రబాబు అన్నారు. జగన్ కు నిజాంగా అంబేద్కర్ పై ప్రేమ ఉంటే.. వైఎస్ పేరుతో ఉన్న స్థలాలకు, కార్యక్రమాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదా కొత్త ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
కానీ అంబేద్కర్ పేరు చెప్పి దళిత నాయకుడు, మేధావి బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని అన్నారు. తెలుగు జాతీ గొప్పతనాన్ని దేశానికి చాటిన గొప్ప మేధావిని అవమానించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తుందని విమర్శించారు. దళితుల మీదా, అంబేద్కర్ మీద జగన్ ప్రభుత్వానికి చిత్త శుద్దీ ఉంటే.. కొత్త జిల్లా లకు అంబేద్కర్ పేరును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము జగన్ సర్కార్ కు ఉందా అని సవాల్ విసిరారు.