ఈపెళ్లి కూతురును చూస్తే నోరూరాల్సిందే..!

-

bride cake designed by emma jayne london

అట్లఎట్లా? పెళ్లి కూతురును చూస్తే నోరూరడమేంది అంటారా? అవును.. ఎందుకంటే ఆమె నిజమైన పెళ్లి కూతురు కాదు. కేక్ అవును.. నమ్మరా? నిజంగా ఆమె కేక్. అందుకే.. మీకు ఆమెను చూస్తే నోరూరుతుందని చెబుతోంది. ఇప్పుడన్నా అర్థమయిందా. ఇలా పెళ్లి కూతురే కాదు.. యుద్ధంలో పాల్గొన్న గుర్రం కేకు, అవతార్ హీరోయిన్ కేకు ఇలా రకరకాల కేకులను తయారు చేసింది ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎమ్మా జేన్. అవును.. ఆమెనే ఈ అందమైన కేకులను తయారు చేసింది. వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. అవి చూడటానికి అచ్చం నిజమైనవిగా కనిపించడం.

bride cake designed by emma jayne london

ఈ కేకులను ఎమ్మా ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించిందట. అందులో గుర్రం కేకును చూసిన వాళ్లు అది నిజమైన గుర్రమే అనుకున్నారట. తర్వాత అది కేక్ అని తెలిసిందట. ఎమ్మా ఇటువంటి కేకులే కాదు.. సెలబ్రిటీ కేకులు, ఇంకా జంతువుల ఆకారంలో ఉండే కేకులు.. ఇలా రకరకాల కేకులను తయారు చేస్తుందట. పెళ్లి కూతురు కేక్, గుర్రం కేక్, అవతార్ కేక్ బెస్ట్ కేకులుగా అవార్డులను కూడా అందుకున్నాయట.

bride cake designed by emma jayne london

bride cake designed by emma jayne london

bride cake designed by emma jayne london

bride cake designed by emma jayne london

bride cake designed by emma jayne london

Read more RELATED
Recommended to you

Latest news