కేకుల్లో బోలెడు రకాలు ఉన్నాయి.. కానీ మసాల కేక్ గురించి మీరు ఎప్పుడైన విన్నారా.. ఎగ్స్ లేకుండా.. హై ప్రొటీన్ తో, ఎక్కువగా బలాన్ని ఇచ్చే గ్రీన్ హార్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చిన్నపిల్లలకు ఇలాంటివి పెడితే.. బాడీకీ మంచిగా ప్రొటీన్ అందుతుంది. ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గ్రీన్ మసాల కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
సోయా ఆకు ఒక కప్పు
పాలక్ తురుము అరకప్పు
పచ్చిబఠానీ అరకప్పు
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
బంగాళదుంపల తురుము అరకప్పు
పెరుగు అరకప్పు
ఓట్స్ పొడి రెండు టేబుల్ స్పూన్
పుట్నాలు పొడి రెండు టేబుల్ స్పూన్స్
బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్స్
మీగడ ఒక టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్
వాము ఒక టీ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
మిరియాల పొడి ఒక టీ స్పూన్
వంటసోడా కొద్దిగా
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
తయారు చేసే విధానం..
ముందుగా మనం తీసుకున్న పచ్చి బఠానీని మిక్సీ జార్ వేసి పేస్ట్ చేసుకోండి. ఒక బౌల్ లో బంగాళదుంపల తరుము, సోయా ఆకు తురుము, పాలకూర, కొత్తిమీరు, ఓట్స్ పౌడర్, బొంబాయి రవ్వ, పుట్నాలపప్పు, పచ్చిమిర్చికాయ ముక్కలు, వాము, మిరియాల పొడి, జీలకర్ర, అల్లం తురుము, పసుపు, వంటసోడా, నిమ్మరసం, పచ్చిబఠానీ పేస్ట్, పెరుగు వేసి కలిపి 15నిమిషాల పాటు నానివ్వండి. కేక్ ట్రేలో మీగడ రాసి.. ఈ పిండిని వేసి.. ఆవిరి మీద ఉడకనివ్వండి. అరగంటసేపు ఆవిరిలో ఇది ఉడుకుతుంది. అంతే ప్రొటీన్ రిచ్.. మసాల కేక్ రెడీ. పిల్లలకు ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తుంటే.. చాలా మంచిది. ఈ కేక్ ను డయాబెటీస్ ఉన్నవాళ్లు, ఆస్తమా, దంతాల సమస్య ఉన్నవారు కూడా తినొచ్చు.
-Triveni Buskarowthu