నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్రం లో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఉన్న.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లో మహిళల ఎంట్రీ పై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లో మహిళలకు కూడా స్థానం కల్పిస్తు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

దీంతో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లో మహిళల ఎంట్రీ కి మార్గం సుగమం అయింది. కాగా.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లో ప్రవేశ్‌ కోసం మహిళలు కూడా పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు.. గత నెల 18 వ తేదీన ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది సుప్రీం కోర్టు. లింగ వివక్ష ఆధారం గా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని… ఆ సందర్భంగా సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. ఈ నేపథ్యం లోనే ఇవాళ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లో మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు నిర్ణయం తీసుకుంది కేంద్రం..