మైక్రోగ్రీన్స్ ను ఇంట్లో ఇలా పెంచండి.. వాటితో పుల్కాలు చేసుకుంటే.. ఎన్ని లాభాలో..!

-

మైక్రోగ్రీన్స్ గురించి ఈ మధ్య చాలామందిలో అవగాహన పెరిగింది.. ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటానికి మెయిన్ రీజన్ సూక్ష్మపోషకాలు ఇందులో ఎక్కువగా ఉండటమే.. వీటిని పోషకాల గణి అని చెప్పొచ్చు. ఈరోజు మనం మెక్రోగ్రీన్స్ అంటే ఏంటి, వేటిని పెంచుకోవాలి, ఎలా వాడుకోవాలో చూద్దాం.

మొలకెత్తిన విత్తనాలు తినడం అందరికి బాగా తెలిసే ఉంటుంది..ఈ విధానంలోనే.. ఇంకో రెండుమూడు రోజులు ఉంచి.. నీళ్లు చల్లుతూ కాస్త గాలీ, వెలుతురూ తగిలేలా నీడలో ఉంచుకుంటే.. మొక్క ఎదిగి రెండు మూడు ఆకులు వస్తాయి. అలా వచ్చిన వాటినే మైగ్రోగ్రీన్స్ అంటారు. వీటిని కానీ తిన్నారంటే.. పోషకాహార లోపం అంతా పోతుంది. విటమిన్స్, మినరల్స్ టాబ్లెట్స్ కూడా వేసుకోవక్కర్లేదు.

వీటిని అందరి ఇళ్లలో పెంచుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ గా తోటకూర విత్తనాలు, కొత్తిమీర విత్తనాలు, గోధుమలు, పెసలు, బొబ్బర్లు, బ్రోకొలి, కాలిఫ్లవర్, క్యారెట్, పాలకూర, ముల్లంగి, బీట్ రూట్, వాము, వెల్లుల్లి, కీరదోస, బీన్స్, బఠానీ, మెంతి వంటివి చేసుకోవచ్చు. వీటిలో ఏ రకమైన విత్తనాలు వేసి అయినా 4-5 రోజులు ఉంచేస్తే మూడు అంగుళాల పొడవు వస్తుంది. లేత గ్రీన్ గా ఉండే ఆకులు వస్తాయి. వీటిని తినాలంటే.. పసరవాసన వచ్చి.. తినలేరు. కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినాలి.. మైక్రోగ్రీన్స్ కట్ చేసుకుని అందులో ఏదైనా కలుపుకుని సలాడ్స్ లా తింటారు.. ఈరోజు మనం ఈ మైక్రోగ్రీన్స్ ను ఎలా వాడుకోవచ్చో కూడా తెలుసుకుందాం.

మైక్రోగ్రీన్ పుల్కాలు చేసుకుని తింటే.. మీరు అసలు ఇబ్బంది పడకుండా.. టేస్టీగా హెల్తీ ఐటమ్స్ ను తినొచ్చు. మైక్రోగ్రీన్స్ ను కట్ టేసి.. చిన్న ముక్కలుగా చేసి.. మల్టీగ్రెయిన్ పుల్కా పిండి తయారుచేసుకుని.. ఆ పిండిలో..రెండింతలు ఈ మెగ్రోగ్రీన్ ముక్కలు కలిపండి. దాన్ని ఉండగా చేసుకుని పుల్కాలు చేసుకోవడమే. దాంతో.. మైక్రోగ్రీన్స్ లో పచ్చిదనం పోతుంది. పుల్కాలు 2-3 నిమిషాలు మాత్రమే హీట్ లో ఉంటాయి.. అదే వాటితో ఏదైనా కూరలాంటివి చేసుకుంటే.. పావుగంట నుంచి అరగంట వరకు హీట్ లో ఉంటాయి. దాంతో మైక్రోగ్రీన్స్ లో పోషకాలు పోతాయి.

ఇలా పిల్లలకు, పెద్దలకు పెడితే ఎంతో మంచిది. జొన్నపిండిలో, రాగిపిండిలో కూడా ఇలా ఏ రకమైన పిండిలో అయినా సరే..పుల్కాలు చేసుకునేముందు.. మైక్రోగ్రీన్స్ ముక్కలు వేసుకుని చేసుకోవచ్చు. కాబట్టి.. ఇళ్లల్లో మెక్రోగ్రీన్స్ పెంచుకునే వాళ్లు ఇలా ట్రే చేయండి. మనం ఇలాంటివి ఎలా పెంచాలో కూడా ఈ సైట్ లో అందించాం. గోధుమ గడ్డిని ఇంట్లో ఎలా పెంచాలో ఉంది.. ఆసక్తి ఉన్నవారు.. చూసి.. అదే ప్లేస్ లో పైన చెప్పిన విత్తనాలు కూడా పెంచుకుని చేసుకుని తినొచ్చు. ఈరోజుల్లో ఇలాంటివి తింటుంటే.. ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి రోగాలు, లోపాలు ఉండవు.

ఇప్పటికే సెలబ్రెటీలు మైక్రోగ్రీన్స్ ను తమ ఆహారంలో చెసుకుని సోషల్ మీడియా ద్వారా మనకు చెప్తున్నారు. మైక్రో గ్రీన్స్ ద్వారా మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్స్ , పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇలాంటి వాటిపై ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు.. ఇంట్లో ఓసారి ట్రే చేసి చూడండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news