లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ.. నివేదిక పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు

-

రాష్ట్రంలోని నిరుపేదలకు నీడనిచ్చేందుకు తెలంగాణ సర్కార్ రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సొంత స్థలాలు ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా ఆర్థికసాయం అందించే పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గృహలక్ష్మి పేరిట ఒక్కో ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ. 3 లక్షలను ప్రభుత్వం గ్రాంటుగా అందించనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి సర్కార్ ఆర్థిక సాయం అందించనుంది.

గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలకు నివాస స్థలాల పంపిణీకి రాష్ట్రంలో గుర్తించిన వెయ్యి 39 ఎకరాల భూములకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. నిరుపేదలకు లబ్ది కలిగే 58, 59, 76,118 జీవోలపై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి, క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాల నుంచి సమగ్ర సమాచారం వచ్చాక ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం విధానపర నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news