ఏపీ గవర్నర్ ను కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు

-

ఏపీ గవర్నరుని గ్రూప్-1 అభ్యర్థులు కలిశారు.అధికారుల నిర్ణయం వల్ల భవిష్యత్తు కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థుల ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్-1 అభ్యర్థులు గవర్నరును కలవడానికి వచ్చిన సమయంలోనే రాజ్ భవనుకు వచ్చిన ఏపీపీఎస్సీ గౌతమ్స వాంగ్…యాన్యూవల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గవర్నరును కలిశారు. గ్రూప్-1 ఫలితాల విషయంలో తాజా పరిణామాల ప్రస్తావన..? వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలెలా మారతాయి..?జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణం ఏమిటి..? అని గ్రూపు ఒన్ అభ్యర్థి మధుబాబు ఫైర్ అయ్యారు.

అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయింది…గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారన్నారు. 202 మందిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారు..గతంలో సిద్దం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయి..? అని ప్రశ్నించారు. 55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారు..?

హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా..? అని ఆగ్రహించారు. ఈ ఫలితాలు నిలిపేసి అక్రమాలు జరగలేదని నిరూపించండి.కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు..?సీతారామాంజనేయులు ఉన్న సమయంలో రూల్ ప్రకారం జరిగిందన్నారు. కొత్త అధికారులు వచ్చాక కొత్త వారిని ఎంపిక చేశారు…డిజిటల్ ఇవాల్యూషనులో అంతా పారదర్శకత అన్నారనీ తెలిపారు. ఇప్పుడు అభ్యర్థులనే మార్చి మాకు అన్యాయం చేశారు…అర్హత లేనివారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news