వరుసగా ఏడో సారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

-

జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏడోసారి రికార్డు సృష్టించాయి. సెప్టెంబరు నెలకు గానూ రికార్డు స్థాయిలో  రూ.1,47,686  కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైంది. కాగా.. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైన నమోదవ్వడం వరుసగా ఇది ఏడోసారి కావడం విశేషం.

జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న పలు చర్యలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం.. భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లకు దోహదం చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39శాతం పెరిగిందని, ఇక దేశీయ లావాదేవీల ఆదాయంలో 22శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరులో రూ.3,494 కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు.. గత నెలలో రూ.3,915 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లలో 21శాతం వృద్ధి కన్పించింది. ఏపీలో గతేడాది సెప్టెంబరులో రూ.2,595 కోట్లుగా ఉన్న వసూళ్లు.. గత నెలలో రూ.3,132 కోట్లకు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news