తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదల

-

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో మొదలుకానుంది. ఈరోజు హైదరాబాద్ లోని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాసంలో భారత్ జోడో యాత్ర గురించి చర్చించారు. అనంతరం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు. ఈ యాత్ర తెలంగాణలో మొత్తం 13 రోజులకు కుదించారు. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ.

13 రోజులపాటు రోజువారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితాని సిద్ధం చేశారు. ఈ పాదయాత్ర మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండలం, కృష్ణ గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానుంది. 1వ రోజు మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గంలో నేతలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 2వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

3 వ రోజు మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని యాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 4 వ రోజు జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రాహుల్ పాదయాత్రలొ నాగర్ కర్నూల్, ఖమ్మం లోక్సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. 5 వ రోజు షాద్నగర్ నియోజకవర్గం లోని పాదయాత్రలో మహేశ్వరం, భువనగిరి లోక్సభలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 6 వ రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

7వరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు పాల్గొంటారు. 8వ రోజు.. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఈ యాత్రలో మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు. 9వ రోజు.. సంగారెడ్డి లో కొనసాగనున్న రాహుల్ యాత్ర.. మెదక్, వరంగల్ లోక్ సభ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

10వ రోజు..జోగి పేట లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు. 11వ రోజు..శంకరం పేట ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర.. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 12 వ రోజు..జుక్కల్ ప్రాంతాల్లో సాగనున్న రాహుల్ యాత్ర.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 13వ రోజు.. జుక్కల్ లోనే సాగనున్న యాత్ర.. కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్త ముఖ్య నేతలు పాల్గొంటారు. 13వ రోజు సాయంత్రం తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news