ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 16వ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ ముంబై నగరంలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ హర్ధిక్ పాండ్య ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
కాగ గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్ లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్ లు ఆడి.. రెండింట్లో విజయం సాధించింది. ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి మరింత ముందుకు వెళ్లాలని ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. కాగ తుది జట్లు ఇలా ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు :
మాథ్యూ వేడ్ ( వికెట్ కీపర్ ), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే
పంజాబ్ కింగ్స్ తుది జట్టు :
మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో ( వికెట్ కీపర్ ), జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్