Breaking : ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

-

తెలంగాణ ఆర్టీసీ ప్ర‌యాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ఛార్జీల‌ను భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచ‌గా.. తాజా గా మ‌రో సారి పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. డీజిల్ సెస్ పేరు తో ఈ సారి టీఎస్ ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచింది. ప‌ల్లె వెలుగు, సీటీ ఆర్డ‌న‌రీ బ‌స్సుల‌లో రూ. 2 చొప్పున ఛార్జీల‌ను పెంచారు. అలాగే మెట్రో, సూప‌ర్ డిల‌క్స్, ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో రూ. 5 చొప్పున ఛార్జీల‌ను టీఎస్ ఆర్టీసీ పెంచింది.

టీఎస్ ఆర్టీసీ పెంచిన ధ‌రలు రేప‌టి నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. టీఎస్ ఆర్టీసీ ఈ రోజు ధ‌ర‌లు పెంచ‌డంతో బ‌స్సు స‌ర్వీసు క‌నీస ధ‌ర రూ. 10 గా మారింది. గ‌తంలో టీఎస్ ఆర్టీసీ.. రౌండ‌ప్ పేరుతో కూడా బ‌స్సు ఛార్జీల‌ను భారీగానే పెంచింది. ఇప్పుడు మ‌రో సారి బ‌స్సు ఛార్జీలు భారీ మొత్తంలో పెంచింది. దీంతో ప్ర‌యాణికుల పై భారం ఎక్కువ ప‌డుతుంది. అయితే టీఎస్ ఆర్టీసీ న‌ష్ట‌ల్లో కురుకుపోయింది. ఆర్టీసీ న‌ష్టల్లో నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి ఎండీ స‌జ్జ‌నార్ తీవ్రంగా క‌ష్ట ప‌డ్డా.. ఫ‌లితం లేక పోయింది. దీంతో ధ‌ర‌ల‌ను పెంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news