పవన్‌లో ఉన్నది పసుపు రక్తం, నారా నరాలు అంటూ చురకలు అంటించారు గుడివాడ అమర్ నాథ్. జనసేన పేరును చంద్రసేనగా మారిస్తే బాగుంటుందని మంత్రి గుడివాడ కౌంటర్ ఇచ్చాడు. నిన్న శ్రీకాకుళం వేదికగా వైసిపి నేతలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి గుడివాడ కౌంటర్ ఇచ్చాడు. మీ అమ్మను తిట్టిన వాళ్లను భుజాల మీద ఎక్కించుకొని… పల్లకి మోస్తున్నావు.. నువ్వు బానిస కాకపోతే బాహుబలి వా ? అని నిలదీశారు. పవర్ స్టార్ పక్కా ప్యాకేజి స్టార్ అని ఫైర్ అయ్యారు గుడివాడ.
పవన్ కళ్యాణ్ పగటి వేషాలు వేస్తున్నాడు… చంద్రబాబుకు పవన్ పూర్తిగా అమ్ముడుపోయాడు.. చంద్రబాబు, పవన్ ఒకే తానులో ముక్కలు.. 2014-19 పాలనపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.. చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ సభ అని విమర్శించారు.