అతిథికి ద‌క్కించే గౌర‌వం ఇదేనా కేసీఆర్ !

-

తెలంగాణ సీఎం కేసీఆర్ వరసగా ఉద్యోగులకు వరాల జల్లు ప్రకటిస్తున్నారు. మంగళవారం సమావేశాల్లో ప్రసంగించిన ఆయన… సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో తొలిగింని ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలా అన్ని వర్గాల ఉద్యోగులకు వరాలు కురిపిస్తున్నారు. మరోవైపు 80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. 

ఇదిలా ఉంటే ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అథితి అధ్యాపకులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. కాగా వీరిందరికీ గత ఏడాది అక్టోబర్ నుంచి జీతాలు ఇవ్వడం లేదు. వారికి జీతాలు ఇవ్వకపోవడంతో చాలా మంది అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీరి విషయంలో స్పందించాలని.. వెంటనే జీతాలు చెల్లించాలని రాష్ట్ర అథితి అధ్యాపకుల ఐకాస రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news