మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతో కాదు, మనం యుద్ధం చేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్దంచేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారని… సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌కమిటీలు.., ఎంపీటీసీలు… వీరంతా ఉన్నారని చెప్పారు. వీరందరికీ మంచి శిక్షణ అవసరమని.. తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వారికి డైనమిక్‌గా ట్రైనింగ్ ఇవ్వాలని.. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్ ఇస్తారని వెల్లడించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వారు ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తారని.. గోబెల్స్ ప్రచారంతో బుల్డోజ్ చేస్తారని ఆగ్రహించారు.
సారా తాగిస్తే ప్రభుత్వానికే ఆదాయం తగ్గుతుంది కదా అని జగన్ అన్నారు. రెండేళ్లలో సారాపై 13 వేల కేసులు నమోదు చేశామని అసెంబ్లీలో వెల్లడించారు. చోటు చేసుకున్న మరణాలు ఒకేసారి జరగలేదని.. వారం రోజుల వ్యవధిలో జరిగాయని.. సాధారణ మరణాలను టీడీపీ ట్విస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.